గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గొర్రెలు, బతుకమ్మ చీరల పంపకాల పేరుతో కోట్లు దోచుకున్నారన్నారు. సూరత్ నుంచి నాసిరకం చీరలు తెప్పించి పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములు అమ్ముకున్నారన్నారు. కట్టడాల లెక్కల గురించి హరీశ్ రావు చెబుతున్నారు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠాణీలు అమ్మినట్టు అమ్మారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పాలమూరు ప్రజలు ఏం పాపం చేశారని మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయలేదని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కన్న ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఎక్కువ జరిగిందని చెప్పారు.