ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడు రోజుల పర్యటన విజయవంతమైంది. గురువారం ఉదయం 10 గంటలకు జనగామ కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, డీసీపీ రాజమహేంద్రనాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేశ్‌కుమార్‌లు ఘనస్వాగతం పలికారు. పోలీసులను సన్మానించిన అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు.
సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా విశిష్టత, అభివృద్ధిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం గవర్నర్ నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు, కవులు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్యాలు చేశారు.