జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ సూర్యారావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో వేద మంత్రోచ్ఛారణలు, పండితుల ఆశీస్సుల మధ్య నూతన బాధ్యతలను స్వీకరించిన ఈ కార్యక్రమం జరిగింది. పొలిటికల్ సీన్‌లో జనసేన ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఘటన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు ఎట్టకేలకు తమ నేతకి సత్తా వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.
