హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గరపు దయానంద్, ఎగ్గె మల్లేశం, బస్వరాజు సారయ్య. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి దీపదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.