వాస్తవానికి ఈరోజు జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున రేపటికి వాయిదా పడింది. టీపీసీసీ చీఫ్ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అనుకున్న ప్రకారం వరంగల్ పర్యటనకు రాలేకపోతున్నారు. ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారని, రేపు వరంగల్ పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన షెడ్యూల్ లో మధ్యాహ్నం 1:30 గంటలకు టెక్స్ టైల్ పార్క్ సందర్శన, 2:10 గంటలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తనిఖీ, సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండడంతో ఈ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. వాయిదా పడినప్పటికీ ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమావేశాల ఫలితాలను బట్టి శుక్రవారం వరంగల్‌కు వెళ్లే అవకాశం ఉంది.