ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. దీని ప్రకారం, ఈ ఐపీఎల్లో SRH జట్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తాడు. గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్రామ్ జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఐడెన్ మార్క్రామ్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్‌లు ఆడగా కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో టోర్నీని కూడా ముగించింది. కాబట్టి ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నాయకత్వాన్ని మార్చబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆస్ట్రేలియా జట్టు విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన ప్యాట్ కమిన్స్‌కు పగ్గాలు అప్పజెప్పారు. కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ODI ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీంతో కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన రెండో బిడ్డింగ్. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఆటగాడిని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్రకటించడం విశేషం.