Bhuvneshwar Kumar Sets Rare Record: చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్‌కు ముందు అతని పేరిట 199 వికెట్లు ఉండగా, తన మొదటి ఓవర్‌లోనే ఆయుష్ మాత్రేను ఔట్ చేసి ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు సాధించిన రెండో బౌలర్ కూడా భువి కాగా, అతనికి ముందు యజువేంద్ర చాహల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన బ్యాటింగ్‌తో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ 2026లో తొలి 250 స్కోరు. టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలవగా, దేవదత్ పడిక్కల్ 50 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా 48 పరుగులతో జట్టును భారీ స్కోరుకు చేర్చాడు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు