IND Vs ENG 4th Test Match: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో బుధవారం (జూలై 23) ఇంగ్లాండ్ మరియు భారత మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇదే సమయంలో భారత కెప్టెన్ గిల్ టాస్ ఓడిపోవడం వరుసగా నాలుగోసారి జరగడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌కు ఒకే మార్పుతో బరిలోకి దిగింది – స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో ఆల్‌రౌండర్ లియాన్ డాసన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఇంకా భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో అనుషూల్ కంబోజ్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకొని తన తొలి టెస్టుకు సిద్ధమయ్యాడు.
Internal Links:
మరోసారి విండీస్ కు తప్పని ఓటమి..
డబ్ల్యూసీఎల్ 2025 నేటి నుంచి ఆరంభం..
External Links:
నాలుగో టెస్టులో ఇండియా బ్యాటింగ్.. మూడు మార్పులతో గిల్ సేన.. కొత్త కుర్రాడికి ఛాన్స్