మహిళల ఆసియా కప్‌లో భారత్ ఘనంగా బోణి కోటింది. శుక్రవారం రంగి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా కప్ టీ20 2024లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వేటను ఘనంగా ప్రారంభించింది. తోలి మ్యాచ్ లోనే ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ 108(19.2)లకు పరిమితం అయింది. దీప్తి శర్మ (3/20), రేణుక సింగ్ (2/14), శ్రేయాంక పాటిల్ (2/14) అద్భుతంగా రాణించారు. పాకిస్తాన్ జట్టులో టాప్ స్కోరర్ గా సిద్రా అమీన్ 25(35) నిలిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (31 బంతులలో, 45 పరుగులు ), షఫాలీ వర్మ(29 బంతులలో, 40 పరుగులు ),దయాళన్ హేమలత (11 బంతులలో, 14 పరుగులు), చేసి ఔట్ కాగా తదుపరి బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్(11 బంతులలో, 5 పరుగులు ), జెమిమా రోడ్రిగ్స్ (3 బంతులలో, 3 పరుగులు) చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చారు.
జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టుకి చెందిన దీప్తి శర్మ “ప్లేయర్ అఫ్ ది మ్యాచ్” అవార్డు కైవసం చేసుకుంది. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ యూఏఈతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ రంగి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జులై 21 న ఆదివారం జరగనుంది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ జట్టు కెప్టెన్ నిధా దర్ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించింది. పవర్ ప్లే లో అనుకున్నంతగా పరుగులు చేయకపోవడం తమ జట్టు ఓటమికి కారణమని పేర్కొంది. మా ఓటమిపై జట్టుగా కలిసి సుదీర్ఘంగా చర్చిస్తాం అని పేర్కొంది. టీ20ల్లో పవర్‌ప్లే చాలా కీలకం అని పవర్‌ప్లేలో అధిక పరుగులు సాధిస్తే మ్యాచ్‌లను గెలవచ్చు అని తెలిపింది. పాక్ తమ తదుపరి మ్యాచ్ ఆదివారం నేపాల్‌తో తలపడనుంది.