India Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం మార్చుకుంది. చర్చల ద్వారా సానుకూల ఫలితం రావడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తి మేరకు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇచ్చినట్లు ఫిబ్రవరి 9న ప్రకటించింది. టీమిండియా–పాక్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగనుంది.
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మరియు ఐసీసీ మధ్య చర్చలు జరిగాయి. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై పునరాలోచన చేయాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పాక్‌ను కోరాయి. అయితే పాక్ ప్రతిపాదించిన త్రైదేశీయ సిరీస్, ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణ డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్‌కు ప్రపంచకప్ దూరం కావడంతో జరిగిన నష్టంపై ఐసీసీ ఇతర మార్గాల్లో సహాయం చేసే అవకాశం ఉందని సమాచారం.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!
External Links:
భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఇక, 15న దబిడి దిబిడే