Joe Root Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో 521 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి సచిన్ టెండూల్కర్ (522 ఇన్నింగ్స్) రికార్డును అధిగమించాడు. విరాట్ కోహ్లీ (490 ఇన్నింగ్స్) తర్వాత వేగంగా 23 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్, తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
టెస్టుల్లో సచిన్ 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రూట్ 14,278 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 1,643 పరుగుల తేడా ఉంది. వన్డేల్లోనూ రూట్ అద్భుతంగా రాణిస్తూ 7,826 పరుగులు, 20 సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!