ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమ్ ఇండియా సంబరాలు కొనసాగాయి. టీమ్ ఇండియా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా స్టేడియం అంతా కలియదిరిగారు.
ఇక, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తల్లి కూడా మైదానంలోకి ప్రవేశించింది. షమీతో కలిసి ఆమె వద్దకు వెళ్లిన విరాట్ కోహ్లీ ఆమె పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత షమీ కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగాడు. వారితో ఆప్యాయంగా ముచ్చటించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.