LA’s 2028 Olympics: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, 2028ను పర్యవేక్షించేందుకు వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భద్రత, వీసాల సదుపాయం, వివిధ ప్రభుత్వ ఏజెన్సీల సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారించనుంది. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ త్వరలో సంతకం చేయనున్నారు. ట్రంప్ క్యాబినెట్, ఇతర ప్రభుత్వ సంస్థల సభ్యులతో కూడిన ఈ బృందం రవాణా ఏర్పాట్లపై ఫెడరల్, స్టేట్, స్థానిక ప్రభుత్వాలతో చర్చిస్తుంది. విదేశాల నుండి వచ్చే అథ్లెట్లు, కోచ్‌లు, మీడియా ప్రతినిధుల వీసా ప్రక్రియను కూడా ఇది పర్యవేక్షించనుంది. మూడు సంవత్సరాల తర్వాత జరగనున్న ఈ ఒలింపిక్స్‌పై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు.
ట్రంప్ తన మొదటి పదవీకాలంలో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బిడ్ సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ అంతర్జాతీయ క్రీడా ఉత్సవంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇది ఒక గొప్ప గౌరవమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. అమెరికా 1932, 1984లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వగా, ఇప్పుడు మూడోసారి నిర్వహించనుంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు 2028 ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న కీలక ముందడుగు అని లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ చైర్మన్ కేసీ వాస్సర్‌మాన్ తెలిపారు.
Internal Links:
రసవత్తర ముగింపు దిశగా ఓవల్ టెస్ట్..
External Links:
2028 ఒలింపిక్స్ కోసం వైట్ హౌస్