News5am, Latest Breaking News Online(24-05-2025): ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌లో ఆరేళ్ల తర్వాత శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అతను వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. జపాన్‌కు చెందిన యుషి తనకపై 21-18 , 24-22 స్కోరుతో నెగ్గాడు. 2019 తర్వాత శ్రీకాంత్, తొలిసారి బీడబ్ల్యూఎఫ్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతంలో వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న 32 ఏళ్ల ఆ ప్లేయర్ మళ్లీ చాన్నాళ్ల తర్వాత టాప్ ఆటను కనబరిచాడు. ప్రస్తుతం అతను 65వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఓ దశలో ఈ టోర్నీ కోసం అతను క్వాలిఫైయర్స్ ఆడాల్సి వచ్చింది.
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న శ్రీకాంత్, ప్రస్తుతం వరల్డ్ నంబర్ 23 ర్యాంకులో ఉన్న ఆటగాడిపై వరుస గేమ్‌లలో విజయాన్ని సాధించాడు. 2017లో ఆయన బీడబ్ల్యూఎఫ్ నాలుగు టైటిళ్లు గెలుచుకున్నాడు. అయితే, ఇటీవల కొన్ని సీజన్లుగా శ్రీకాంత్ తడబడుతూ వస్తున్నాడు. ఫామ్ మరియు ఫిట్‌నెస్ కోసం ఆయన కృషి చేశాడు.
More Latest Breaking News:
Latest Breaking News Online:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్
హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్..
More Latest Sports News: External Sources
మలేషియా మాస్టర్స్ ఫైనల్లోకి శ్రీకాంత్..