Latest Breaking Telugu

News5am, Latest Breaking Telugu (05-06-2025): ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌లో ఇండియా జట్టు తమ పోరాటాన్ని థాయ్‌లాండ్‌తో ప్రారంభించనుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా-థాయ్‌లాండ్ జట్లు తలపడతాయి. అనంతరం సెప్టెంబర్ 6న డిఫెండింగ్ చాంపియన్ జపాన్, సెప్టెంబర్ 8న సింగపూర్‌తో ఇండియా జట్టు తలపడనుంది. హాకీ ఇండియా బుధవారం ఈ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

గత టోర్నీలో కాంస్య పతకం గెలిచిన భారత మహిళల జట్టు ఈసారి జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్ జట్లతో కలిసి పూల్-Bలో ఉంది. పూల్-Aలో చైనా, కొరియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు చైనా హాంగ్‌జౌలో జరుగుతుంది. విజేత జట్టు 2026 హాకీ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత పొందుతుంది. ప్రతీ పూల్ నుంచి టాప్-2 జట్లు సూపర్-4 దశకు చేరుతాయి. అక్కడ ప్రతీ జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడి, చివరకు టాప్-2 జట్లు ఫైనల్‌కు చేరతాయి.

More Latest Breaking Telugu News:

Breaking Telugu:

ఐపీఎల్ టైటిల్ గెలిచాక కోహ్లీ ఎమోషనల్..

నేటి సాయంత్రం 6గంటలకి ఐపీఎల్ ముగింపు వేడుకలు..

More Latest Telugu: External Sources

థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా తొలి పోరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *