News5am, Latest News Breaking (13-06-2025): ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇండియా vs ఇండియా-ఎ జట్ల మధ్య నాలుగు రోజుల ఇంట్రా-స్క్వాడ్ వార్మ్‌అప్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ద్వారా ప్రధాన సిరీస్‌లో ఆడే ఆటగాళ్ల ఫామ్, బౌలింగ్ కాంబినేషన్‌ను పరీక్షించడమే లక్ష్యం. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మ్యాచ్ గురించి ఏ సమాచారం బయటకు వెల్లిపోకుండా ఉండేందుకు ‘క్లోజ్డ్ డోర్ సెషన్’గా నిర్వహిస్తున్నారు. రోజుకు 90 ఓవర్ల బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఆటగాళ్లు తమ సామర్థ్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపారు. ఇది సాధారణ నెట్ సెషన్ కంటే భిన్నంగా ఉంటుంది.
ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా లేకపోయినా, ఆటగాళ్లకు రెండు అవకాశం కల్పిస్తారు. మొత్తం నాలుగు రోజుల్లో 360 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. బౌలర్లు కావలసినన్ని ఓవర్లు వేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. స్పిన్నర్లు, పేసర్లు తమ రిథమ్‌ను సమీక్షించుకోవచ్చు. జడేజా బ్యాటింగ్ ఉత్తమంగా చేస్తాడన్నా, ఇంగ్లండ్ బజ్‌బాలింగ్‌కి కుల్దీప్‌ను బరిలోకి దించే అవకాశముంది. దీంతో తొలి టెస్ట్‌లో ఎవరు ఏకైక స్పిన్నర్‌గా ఆడతారు అన్నది గంభీర్ బృందం నిర్ణయించాలి. ప్రధాన పేసర్ బుమ్రా బరిలోకి దిగుతాడేమో కానీ, అతడి వెన్ను నొప్పి కారణంగా ఎన్ని ఓవర్లు వేయాలో ఈ మ్యాచ్‌లోనే నిర్ణయిస్తారు. ఫాస్ట్ బౌలింగ్‌లో ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది.
More Latest News Breaking:
Latest News Breaking:
లార్డ్స్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్..
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్..