News5am, Latest News Breaking Telugu (30-05-2025): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ విఫలమైనదే తమ ఓటమికి ప్రధాన కారణమని, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటంలో బ్యాటర్లు విఫలమయ్యారని పేర్కొన్నాడు. తాము నిర్దేశించిన స్కోర్ చాలా తక్కువగా మారిందని, ఈ విషయంలో బౌలర్లను ఎలాంటి తప్పు పట్టలేమని స్పష్టం చేశాడు. ఈ ఓటమి పట్ల లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని, ఈ రోజు తనకు మర్చిపోలేని అనుభూతి మిగిలిందని అన్నారు. మొత్తం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆర్‌సీబీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పాలి.
మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, “ఈ రోజు నాకు మర్చిపోలేని రోజు. మళ్లీ ప్రారంభానికి వెళ్లాలి. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందిగా మారింది. మేం చాలా అంశాలను సమీక్షించాలి. నిజంగా చెప్పాలంటే, తీసుకున్న నిర్ణయాల్లో నాకు ఎలాంటి సందేహం లేదు. మేం మైదానానికి బయటా రూపొందించిన ప్రణాళికలు సరైనవే అని నమ్ముతున్నాను. కానీ వాటిని మైదానంలో అమలు చేయలేకపోయాం. బౌలర్లపై ఎలాంటి నింద వేయలేం, ఎందుకంటే తక్కువ లక్ష్యం మాత్రమే ఇచ్చాం. ఈ పిచ్‌పై మా బ్యాటింగ్ సరిగా రాలేదు, దీనిపై పని చేయాల్సి ఉంది. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచుల్లో బౌన్స్ ఉండడం మనం మర్చిపోకూడదు. కానీ ఇవన్నీ సాకులు కావు. ఎందుకంటే క్రికెటర్ స్థితిగతులను బట్టి తగిన విధంగా ఆడాలి. మేం టైటిల్ పోరులో ఓడిపోలేదు, కేవలం ఈ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయాం” అని పేర్కొన్నాడు.
More News Breaking Telugu:
Today News Breaking Telugu:
విజయమే లక్ష్యంగా బరిలోకి ఆర్‌సీబీ..
More Latest News Telugu: External Sources
ఇది మర్చిపోలేని రోజు.. అదే మా ఓటమిని శాసించింది: శ్రేయాస్