News5am, Latest News Telugu (11-06-2025): 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ కొద్దిసేపట్లో లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు బలంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగనుంది. ఐసీసీ టోర్నీల్లో అనుభవజ్ఞులైన ఆస్ట్రేలియాను ఓడించడం దక్షిణాఫ్రికాకు సవాలే.
ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మూడో ఫైనల్. మొదటి రెండు టైటిళ్లను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. భారత్ మాత్రం గత రెండు ఫైనల్స్‌లో ఓడిపోయింది. ఈసారి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించలేక మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తుండగా, 27 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తోంది.
More Latest News Today:
News Telugu:
ఎంఎస్ ధోనికు క్రికెట్‌లో మరో అరుదైన గౌరవం..
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్..
More Sports News: External Sources
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్! 27 ఏళ్ల కల నెరవేరేనా?