News5am, Latest Telugu News (03-06-2025): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ముగింపు వేడుకలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇటీవల విజయవంతంగా ముగిసిన ఆపరేషన్ సింధూర్‌కు గుర్తుగా, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపేలా బీసీసీఐ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ పాల్గొననున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన త్రివిధ దళాల సైనికులను బీసీసీఐ ఈ సందర్భంగా సత్కరించనుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు నివాళులర్పణ కూడా చేయనున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇప్పటివరకు బెంగళూరు జట్టు 2009, 2011, 2016 సంవత్సరాల్లో ముగింపు మ్యాచ్‌కి వెళ్లినా విజయం సాధించలేకపోయింది. ఈసారి 2025 సీజన్‌లో నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇక పంజాబ్ కింగ్స్ మాత్రం 2014లో ఒకసారి ఫైనల్‌కి చేరిన తరువాత ఇప్పుడే, 11 ఏళ్ల తర్వాత, మళ్లీ ఫైనల్‌కు వచ్చింది. ఈ రెండు జట్లూ ఇప్పటికీ ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయాయి. కాబట్టి, ఈసారి ఎవరు గెలిచినా వారి తొలి ఐపీఎల్ కప్ కావడం విశేషం.
More Telugu News Today:
Sports Latest News:
తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడిన పంజాబ్..
గుకేష్ నార్వే చెస్ 2025 ఆరో రౌండ్‌లో సూపర్ విక్టరీ..
More Telugu News: External Sources
సాయంత్రం 6 గంటలకే ఐపీఎల్ ముగింపు వేడుకలు..