భారత యువ మహిళా షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి మూడో పతకంపై కన్నేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ నిన్న ఫైనల్‌కు చేరుకుంది.
నిన్న జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 22 ఏళ్ల మను భాకర్ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించింది. మను భాకర్ ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. ఇప్పుడు మూడో పతకం కూడా సాధిస్తే ఆమె పేరు భారత ఒలింపిక్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.