MI New York lifts the MLC Trophy: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 విజేతగా MI న్యూయార్క్ జట్టు నిలిచింది. జూలై 14న టెక్సాస్‌లోని డల్లాస్ గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 5 పరుగుల తేడాతో గెలిచి రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మోనాంక్ పటేల్ (28) మరియు క్వింటన్ డికాక్ (77) శుభారంభాన్ని అందించగా, చివర్లో కెప్టెన్ నికోలస్ పూరన్ (21), కున్వర్‌జీత్ సింగ్ (22) ముఖ్యమైన పరుగులు చేశారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలింగ్‌లో లూకీ ఫెర్గూసన్ 3 వికెట్లు తీసి రాణించగా, నేత్రావల్కర్, ఎడ్వర్డ్స్, మ్యాక్స్‌వెల్, హోలాండ్ తలో వికెట్ తీసారు.
చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (70), గ్లెన్ ఫిలిప్స్ (48), జాక్ ఎడ్వర్డ్స్ (33) పోరాడినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన సమయంలో కేవలం 7 పరుగులకే పరిమితమై, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఔటవ్వడంతో వాషింగ్టన్ జట్టు ఓటమి చవిచూసింది. ఎంఐ న్యూయార్క్ బౌలింగ్ విభాగంలో బౌల్ట్, రుచిల్ ఉగార్కర్ చెరో రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, నోస్తుష్ కెంజిగే ఒక వికెట్ తీశాడు.
Internal Links:
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్..
మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్..
External Links:
దుమ్మురేపిన డికాక్.. రెండోసారి MLC ట్రోఫీ ఎగరేసుకుపోయిన MI న్యూయార్క్