Pant ruled out of fifth Test: మాంచెస్టర్‌లో భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదో మరియు చివరి టెస్ట్ జూలై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభమవుతుంది. అయితే, ఈ టెస్టుకు సిరీస్ హీరో రిషబ్ పంత్ గాయం కారణంగా దూరమయ్యాడు. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నాల్గవ టెస్ట్‌లో పంత్ కుడి కాలికి గాయం కావడంతో అతను ఐదో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని తెలిపింది. అతని స్థానంలో వికెట్ కీపర్ మరియు బ్యాటర్ అయిన నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. బోర్డు ఐదో టెస్ట్ కోసం తాజా జట్టును కూడా వెల్లడించింది.
ఈ సిరీస్‌లో పంత్ అద్భుతమైన ఫామ్‌ను చూపించాడు. ఇప్పటివరకు 4 టెస్ట్‌లలో 7 ఇన్నింగ్స్‌లు ఆడి 68.42 సగటుతో, 77.63 స్ట్రైక్‌రేట్‌తో 479 పరుగులు చేశాడు. ఇందులో ఆయన 3 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఉన్నాడు. నాల్గవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాలి వేలుకు గాయం కావడంతో అతను రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయినప్పటికీ, రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి గాయంతో ఇబ్బంది పడుతూ కూడా 54 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. తాజా జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ కశ్దీప్, అకుల్ దీప్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్) ఉన్నారు.
Internal Links:
సిక్సుల వర్షం కురిపించిన టిమ్ డేవిడ్..
External Links:
ఐదో టెస్టుకు పంత్ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్