భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు వినేశ్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్ పై పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‌లో ఆడకుండా అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేశ్ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు. కుస్తీ నాపై గెలిచింది , నేను ఓడిపోయాను, మీ కల, నా ధైర్యం అన్నీ చెదిరిపోయాయి , ఇప్పుడు నాకు పోరాడే బలం లేదు. కుస్తీకి వీడుకోలు (2001-2024). నన్ను ఇంతలా ప్రోత్సహించినందుకు మీకు ఎల్లపుడు రుణపడి ఉంటాను అంటూ సోషల్ మీడియా “X” వేదికగా ప్రకటించారు.
తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వినేష్ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించారు. తాను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్భిట్రేషన్ తీర్పు వెలువడించాల్సి ఉంది. ఇంతలోనే వినీష్ ఈ నిర్ణయం తీసుకుంది. రెజ్లర్‌గా అరంగేట్రం చేసిన వినేశ్ 29 యేళ్ల వయసులో రిటైర్‌మెంట్ ప్రకటించడం భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒలంపిక్స్ నుంచి ఆమె వెనుదిరిగిన తర్వాత ఆమెకు ధైర్యం చెబుతూ ప్రధాని నరేంద్రమోదీతో సహా ఎందరో ప్రముఖులు ఎన్నో పోస్టులు పెట్టారు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ గోల్డ్ మెడల్ సాధించేందుకు 2028 LA గేమ్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. అయినప్పటికీ వినేష్ మనోధైర్యం కోల్పోయారు. చివరి యుద్ధంలో ఓడిపోయానని, ఇకపై కొనసాగించడానికి ఏమీ మిగల్లేదని ఉద్వేగానికి గురయ్యారు. వినీశ్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.