PV Sindhu: ఈ సీజన్‌లో భారత్‌కు గర్వకారణమైన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ఐదోసారి ఆమె మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. తాజాగా జపాన్ ఓపెన్ 2025 సూపర్ 750 టోర్నీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు, దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యు జిన్ చేతిలో వరుస సెట్లలో (15-21, 14-21) ఓటమి పాలైంది. ఈ విజయంతో సిమ్ యు జిన్ తన కెరీర్‌లో సింధుపై తొలి గెలుపును నమోదు చేసింది.
ఇంకొవైపు భారత ఆటగాళ్లు మిగతా కేటగిరీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ చైనాకు చెందిన వాంగ్ జెంగ్ షింగ్‌పై 21-11, 21-18తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ రష్మికశ్రీపై 21-15, 18-21, 21-18తో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యుక్–డాంగ్ జు జంటపై 21-18, 21-10తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. అయితే పురుషుల డబుల్స్‌లో హరిహరన్-రుబన్ కుమార్, మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం-సిమ్రన్ సింఘ్ జంటలు తొలి రౌండ్లోనే ఓడిపోయారు.
Internal Links:
రెండోసారి MLC ట్రోఫీ ఎగరేసుకుపోయిన MI న్యూయార్క్..
External Links:
కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!