PV Sindhu: భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో విజయంగా అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో, సింధు 21–15, 8–21, 21–17తో జపాన్‌కు చెందిన వరల్డ్ 6వ ర్యాంకర్, 2022 వరల్డ్ జూనియర్ చాంపియన్ టొమోకా మియాజాకీపై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 62 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్‌ను సింధు గెలిచినా, రెండో గేమ్‌లో మియాజాకీ పుంజుకుని విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మక గేమ్‌లో సింధు వ్యూహాత్మకంగా ఆడి కీలక సమయంలో వరుసగా పాయింట్లు సాధించి విజయం దక్కించుకుంది. గత ఏడాది స్విస్ ఓపెన్‌లో మియాజాకీ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
ఇతర మ్యాచ్‌ల్లో, భారత యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా 21–11, 21–16తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్‌మోర్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ 15వ ర్యాంకర్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జపాన్ క్రీడాకారులు మిత్సుహషి – హిరోకి ఒకమురాపై 21–13, 21–9తో గెలిచారు. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ – శ్వేతపర్ణ జంట హాంకాంగ్ జోడీ టింగ్ యెంగ్ – పుయ్ లామ్ యెంగ్ చేతిలో 12–21, 13–21తో పరాజయం చవిచూశారు.
Internal Links:
నాలుగో టెస్టులో ఇండియా బ్యాటింగ్..
మరోసారి విండీస్ కు తప్పని ఓటమి..
External Links:
చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సింధు బోణీ ఉన్నతి, సాత్విక్ జోడీ కూడా..