ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం, మే 22న జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2లోకి ప్రవేశిస్తుంది. అక్కడ క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. రెండు జట్ల గత ప్రదర్శనలో చాలా తేడా ఉంది. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. మొదటి 9 మ్యాచ్‌లలో 1 మాత్రమే ఓడిపోయింది. అయితే ఆ తర్వాత రాయల్స్ తదుపరి 4 మ్యాచ్‌లలో ఓడిపోగా, 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మరోవైపు తొలి 8 మ్యాచ్‌ల్లో 1 గెలిచిన ఆర్సీబీ.. వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్‌కు చేరుకుంది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మధ్య మూడోసారి ఘర్షణ జరుగుతుంది. ఇంతకుముందు ఐపీఎల్ 2015, 2022లో, రెండు జట్లు వరుసగా ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో తలపడ్డాయి. 2015లో, RCB జట్టు RRని ఓడించింది. రెండేళ్ల క్రితం రాజస్థాన్ స్కోరును ఛేదించి బెంగళూరును ఫైనల్స్‌కు వెళ్లకుండా ఆపింది.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరగ్గా, ఇందులో RCB 15, రాజస్థాన్ 13 విజయాలు సాధించగా, 2 మ్యాచ్‌లు ఫలితం లేకుండా పోయాయి. ఈ సీజన్లో రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది.