Sanju Samson

Sanju Samson: భారత క్రికెట్ అభిమానులను ఎప్పుడూ ఆలోచనలో పడేసే పేరు సంజు శాంసన్. టాలెంట్, ఫామ్ రెండూ ఉన్నా అతడికి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. గత రెండేళ్లుగా భారత జట్టుతో ఉన్నప్పటికీ, 2024 టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశ నుంచి ఫైనల్ వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఆడాల్సిన బ్యాట్ చేతిలో ఉండాల్సింది పోయి, మైదానానికి నీళ్ల బాటిల్ తీసుకెళ్లే వాటర్ బాయ్ పాత్రకే పరిమితమయ్యాడు.

2026 టీ20 ప్రపంచకప్‌లో అయినా సంజు ఆడతాడని అందరూ ఆశించారు. కానీ తొలి మ్యాచ్‌లో కూడా పరిస్థితి మారలేదు. మొత్తం 10 మ్యాచ్‌లకు జట్టుతో ఉన్నా ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. 2024 ప్రపంచకప్ ముందు ఫామ్‌లో ఉన్న సంజు, 2026 ముందు న్యూజీలాండ్ సిరీస్‌లో పేలవంగా ఆడటంతో తుది జట్టులోకి రాలేకపోతున్నాడు. రెండు ప్రపంచకప్‌ల్లోనూ అవకాశం దక్కకపోవడంతో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడించండి అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *