Siraj and Prasidh Fire India Back Into The Game: ఇంగ్లండ్, భారత్ మధ్య ది ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 69.4 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) నిరాశపరిచారు. సాయి సుదర్శన్ (38) నిదానంగా ఆడినా కుదరలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (21) రనౌట్ కాగా, కరుణ్ నాయర్ అర్ధశతకం (57) చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వాషింగ్టన్ సుందర్ 26, ధృవ్ జురేల్ 19 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ 5 వికెట్లు, జోష్ టంగ్ 3, వోక్స్ 1 వికెట్ తీశారు.
ఇంగ్లండ్ బౌలింగ్ తర్వాత బ్యాటింగ్‌లో జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43) వేగంగా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. మిడిలార్డర్‌లో ఒలీ పోప్ (22), జో రూట్ (29), హ్యారీ బ్రుక్ (53) తోడ్పాటు అందించగా, చివరికి ఇంగ్లండ్ 51.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 వికెట్లు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు. క్రిస్ వోక్స్ గాయంతో బ్యాటింగ్‌కు రాలేదు. 23 పరుగుల వెనుకబాటుతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఏ వ్యూహంతో ఆరంభిస్తుందో చూడాలి.
Internal Links:
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తడబడిన టీమిండియా..
చివరి టెస్టుకు నాలుగు మార్పులతో టీమిండియా..
External Links:
చెలరేగిన సిరాజ్, ప్రసిద్ కృష్ణ.. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్!