News5am, Telugu Latest News2 (22-05-2025): ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, ముంబై బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో రోహిత్ శర్మ (5) త్వరగా ఔటైనప్పటికీ, రయాన్ రికెల్టన్ (25) మరియు విల్ జాక్స్ (21) మంచి ఆరంభాన్ని అందించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేయడంతో ముంబైకి మెరుగైన స్కోరు సాధించగలిగింది. చివర్లో నామన్ ధీర్ 8 బంతుల్లో 24 పరుగులు చేసి అతనికి చక్కటి సహాయంగా నిలిచాడు.
ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో ముంబై 66 పరుగులు చేసి మొత్తంగా 180 పరుగుల వద్ద నిలిచింది. తిలక్ వర్మ (27) మరియు హార్దిక్ పాండ్యా (3) పెద్దగా రాణించలేకపోయినా, చివర్లో సూర్యకుమార్ మరియు నామన్ ధీర్ అద్భుత ప్రదర్శన చేశారు. బౌలింగ్ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ముఖేష్ కుమార్ 4 ఓవర్లలో 48 పరుగులు ఇవ్వడంతో పాటు 2 వికెట్లు తీసుకున్నాడు. చమీరా, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ సాధించారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ గెలవాలంటే వారి బౌలర్లు కీలకంగా నిలవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫలితం వస్తుందో, ప్లేఆఫ్స్‌కు ఏ జట్టు చేరుతుందో వేచి చూడాలి.
More Telugu Sports News:
Telugu Latest News2:
ధోని పాదాలను తాకిన యువ ఆటగాడు..
నిప్పుతో ఆటలొద్దురోయ్ అంటూ దిగ్వేశ్ ని ట్రోల్ చేస్తున్నారు..
More Latest Sports News: External Sources
హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?