News5am, The Breaking Telugu News (14-05-2025): ఇండియా యంగ్ షట్లర్లు మానేపల్లి తరుణ్, ఐరా శర్మ, థాయ్‌లాండ్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించగా, కిడాంబి శ్రీకాంత్ నిరాశపర్చాడు. మంగళవారం జరిగిన మెన్స్ క్వాలిఫయర్స్ తొలి రౌండ్‌ను కాస్త కష్టంగా దాటిన తరుణ్, రెండో రౌండ్‌లో21–6, 21–19తో శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. ఆయుష్ షెట్టి 21–10, 21–11తో జొకిమ్ ఒల్డార్ఫ్ (ఫిన్లాండ్)పై నెగ్గగా, తర్వాతి మ్యాచ్‌లో 14–21, 20–22తో జస్టిన్ హోహ్ (మలేసియా) చేతిలో కంగుతిన్నాడు.
సతీశ్ కరుణాకరన్ 17–21, 21–12, 12–21తో అదిల్ షోలె (మలేసియా) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్‌లో ఐరా శర్మ వరుసగా 18–21, 21–12, 21–8తో తెట్ టార్ తుజర్ (మయన్మార్)పై, 21–12, 21–18తో తమోవన్ నితిటిక్రాయ్ (థాయ్‌లాండ్)పై గెలిచి మెయిన్ డ్రాలోకి అడుగుపెట్టింది. మెన్స్ సింగిల్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్ జగ్లాన్–లక్షిత జగ్లాన్ 8–21, 10–21తో ఎంగ్ యు–చాన్ యిన్ చాక్ (చైనీస్‌తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు.
More News:
The Breaking Telugu News
రాజకీయాల్లోకి రోహిత్ శర్మ..
నేడు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం..
Telugu News: External Sources
మెయిన్ డ్రాకు తరుణ్, ఐరా క్వాలిఫై..