WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నమెంట్ నేడు ప్రారంభం కానుంది. తొలిమ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు బర్మింగ్‌హామ్ వేదికగా రాత్రి 9 గంటలకు తలపడనున్నాయి. భారత్ ఈ టోర్నీలో జూలై 20న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ కూడా బర్మింగ్‌హామ్‌లోనే జరగనుంది. ఇండియా ఛాంపియన్స్‌కు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇది మాజీ క్రికెటర్ల కోసం నిర్వహించే ప్రత్యేకమైన టీ20 లీగ్ కావడం విశేషం.
ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ చేరి ప్రాక్టీస్ ప్రారంభించింది. టీమ్లో సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఆర్పీ సింగ్ తదితరులు ఉన్నారు. 2024లో తొలి ఎడిషన్ గెలిచిన భారత్, ఈసారి కూడా టైటిల్ కైవసం చేసుకుంటుందేమో చూడాలి. డబ్ల్యూసీఎల్ 2025లో మొత్తం ఆరు జట్లు – భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పాల్గొంటున్నాయి. టోర్నీ జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు యూకేలోని నాలుగు వేదికలపై జరుగుతుంది. లీగ్ దశలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కసారి ఆడి, అగ్రశ్రేణిలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ ఆగస్టు 2న జరగనుంది.
Internal Links:
ఇంగ్లండ్‌తో భారత్ నాలుగో టెస్టు..
కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం..
External Links:
జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్!