Women’s Cricket World Cup 2025: ఈ ఏడాది చివరిలో జరిగే ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 30న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 1న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో తలపడనుంది. అక్టోబర్ 3న ఇంగ్లాండ్, సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుండగా, అన్ని కళ్లూ లగ్జరీ మ్యాచ్ అయిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉన్నాయి. ఈ హై ఓల్టేజ్ క్లాష్ అక్టోబర్ 5న శ్రీలంకలోని కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
Women’s Cricket World Cup రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించబడుతుంది. అక్టోబర్ 26 వరకు గ్రూప్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ దశ ముగిశాక అగ్రస్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత పొందతాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్ జరగగా, నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో, రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో సెమీ ఫైనల్‌లో తలపడుతుంది. మొత్తంగా ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహిస్తోంది.
భారత్‌లో బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నంలో మ్యాచ్‌లు జరుగుతాయి. భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్ జట్టు భారత్‌లో ఆడడాన్ని భారత్ నిరాకరించడంతో, పాక్ మ్యాచ్‌లను శ్రీలంక కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో నిర్వహిస్తున్నారు. గతంలో 2013లో భారత్ చివరిసారిగా మహిళల వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. ఆ టోర్నీలో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు, ఈ సారి దేశంలో జరిగే వరల్డ్ కప్‌ను గెలవాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది.
Internal Links:
లార్డ్స్‌లోదక్షిణాఫ్రికా విజయం
చరిత్ర సృష్టించే దిశగా సౌతాఫ్రికా..
External Links:
మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఆ రోజే భారత్, పాక్ మ్యాచ్!