Zim vs SA: జింబాబ్వేలోని బులావయో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజున దక్షిణాఫ్రికా బ్యాటర్లు విలక్షణంగా రాణించారు. “ఇది టెస్టు కాదు… టీ20 మ్యాచ్ కదా!” అనేలా భారీ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్వైన్ ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటి నుంచే ఆ నిర్ణయం వారికి శాపంగా మారింది. ఆరంభంలో రెండు వికెట్లుగానే కోల్పోయిన దక్షిణాఫ్రికా, కెప్టెన్ వియాన్ ముల్డర్ ఆధ్వర్యంలో గట్టిగా పుంజుకుంది. ముల్డర్ 259 బంతుల్లో 264 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. 34 ఫోర్లు, 3 సిక్సులతో చెలరేగిన అతను 101.93 స్ట్రైక్‌రేట్‌తో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు బెడింగ్హామ్‌తో కలిసి 184 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఆ తర్వాత ప్రిటోరియస్ కూడా శరవేగంగా 78 పరుగులు చేసి జట్టును 400 పరుగుల మార్క్ దాటించేందుకు సహాయపడ్డాడు. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 465 పరుగులతో నిలిచింది. క్రీజులో ముల్డర్‌తో పాటు బ్రెవిస్ (15 నాటౌట్) ఉన్నాడు. జింబాబ్వే బౌలర్లలో టానాకా చివాంగ, మటిగిము, మసకడ్జా తలో వికెట్ మాత్రమే తీసుకోగలిగారు. మొత్తం 88 ఓవర్లలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఘన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లోనే ప్రత్యర్థిపై మానసిక ఆధిపత్యం సాధించారు. బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు అది పెద్ద తప్పిదంగా మారింది. రెండో రోజున దక్షిణాఫ్రికా మరో భారీ స్కోరు వైపు దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు చూడాల్సిందల్లా ముల్డర్ విధ్వంసం ఎటువరకు కొనసాగుతుందన్నదే.
Internal Links:
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..
నేడు ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు ఆరంభం..
External Links:
వాళ్లకు కాస్త చెప్పండయ్యా.. అది టీ20 కాదు టెస్టు మ్యాచ్ అని.. ఆ కొట్టడు ఏంటయ్యా బాబు..!