హ‌రారే: ఇటీవల జింబాబ్వేతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో గిల్ సారధిగా ఉంటూ టీమిండియా కుర్రాళ్లతో (4-1 )తో సిరీస్ ని చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన రింకూ సింగ్‌ ఫీల్డ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. బీసీసీఐ దీనికి సంబంధించిన వీడియోను త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ సుభాదీప్ ఘోష్‌.. సిరీస్‌లో ఫీల్డింగ్ గురించి చక్కగా వర్ణించారు. క్రికెట్ లో ఫీల్డింగ్ చాలా కీల‌క‌మైంద‌ని, మనం తక్కువ స్కోర్ చేసిన కూడా ఫీల్డింగ్ ఎవరు అయితే అద్భుతంగా చేస్తారో వారికే ఆ మ్యాచ్ విజయం వరిస్తుంది అని పేర్కొన్నాడు.

ప్రతి ఆటగాడు ఉన్న‌త ప్ర‌మాణాల‌తో క్రికెట‌ర్లు ఫీల్డింగ్ చేస్తున్నార‌ని, ఈ రంగంలో మ‌రింత మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించాల‌ని, సంప్ర‌దాయం ప్ర‌కారం ఫీల్డింగ్ మెడల్ ఇస్తామ‌ని, ఫీల్డింగ్ ద్వారా ప్ర‌భావాన్ని చూపిన ఆట‌గాడికి ఫీల్డ‌ర్ ఆఫ్ సిరీస్ అవార్డు ద‌క్కుతుంద‌ని దిలీప్ తెలిపాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో లో భాగంగా ఫీల్డ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు రింకూను వరించిందని ఘోష్ తెలిపారు. కోచ్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ చేతుల మీదుగా రింకూకు ఫీల్డ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అంద‌జేశారు. నేను బ్యాటింగ్‌-ఫీల్డింగ్‌ను ఇష్ట‌ప‌డుతాన‌ని అంద‌రితో ఆడ‌డం ఎంజాయ్ చేశాన‌ని, ఇది నాకు అయిదో సిరీస్ అని, దీన్ని బాగా ఎంజాయ్ చేశాన‌ని రింకూ తెలిపాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *