నేడు భారత్ బ్రిడ్జ్‌టౌన్ లోని బార్బొడాస్ కెన్సింగ్టన్ ఓవల్ క్రికెట్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికా తో తలపడనుంది . ఇటివల జరిగిన మ్యాచ్ లో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినా ఇంగ్లాండ్ పై 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా కూడా ఆఫ్ఘానిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఇరు జట్లు ఓటమి లేకుండా వరుస విజయాలయతో దూసుకొచ్చి ఫైనల్ బెర్త్ ని కైవసం చేసుకున్నాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరెవరు రాణిస్తారో వేచి చూడాల్సిందే? . ఈ మ్యాచ్ లో అయినా స్టార్ క్రికెటర్ విరాట్ కోహిలి విజృభించగలడా. కెప్టెన్ రోహిత్ శర్మ టీం ఇండియా ని అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు , అటు బ్యాటింగ్ లో కూడా మంచి ఫామ్ ని కొనగిస్తున్నాడు. 2023, నవంబర్ 19 లో జరిగిన వరల్డ్ కప్ లో టీం ఇండియా ఆస్ట్రేలియా తో ఓడిపోయిన సంఘటన భారత్ అభిమానులకు నిరాశను కలగా చేసింది. ఈరోజు జరగోబోయే ఫైనల్ మ్యాచ్ లో అయినా భారత్ గెలిచి అభిమానులను సంతృప్తి పరచగలదా. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని రాత్రి 8 గంటలకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఉచితంగా వీక్షించవచ్చు .
భారత్ :రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (WK), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (c), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, తబ్రైజ్ షమ్సీ/ఒట్నీల్ బార్ట్‌మన్,