Kanaka Durga Temple Maha Kumbhabhishekam: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు మార్చి 6 నుంచి 8 వరకు జరుగుతాయి. నేడు ఉదయం అర్చకులు కలశాలతో ఊరేగింపుగా వచ్చి యాగశాల ప్రవేశం, గణపతి పూజ వంటి కార్యక్రమాలతో మహోత్సవాలను ప్రారంభిస్తారు.
ఈ మూడు రోజులలో ఆలయంలో వివిధ పూజలు, హోమాలు నిర్వహిస్తారు. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 9 వరకు అర్జిత సేవలు, అంతరాల దర్శనాలను రద్దు చేసి భక్తులకు బంగారు వాకిలి వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు