News5am, Latest News Telugu (11-06-2025): కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడి ఆలయమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో భక్తులు బయట క్యూ లైనులో వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. నిన్న 80,894 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 32,508 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.3 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇక తిరుమలలో జరుగుతున్న శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ స్వామివారు స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ప్రత్యేక దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
More Latest News:
Telugu Today:
హైదరాబాద్-సికింద్రాబాద్ బోనాల పండుగ..
జూన్ 26తో తొలి బోనం గోల్కొండలో ప్రారంభం అవుతుంది..
More News Telugu: External Sources
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..