తెలంగాణలోని ఓల్డ్ సిటీ, బోనాలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. ఘనంగా జరగనున్న బోనాల ఉత్సవాలు, ఇవాళ ధ్వజారోహణ, శిఖర పూజలతో కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 21వ తేదీన ఆదివారం సాయంత్రం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దేవాలయం నుంచి అమ్మవారి ఘటం ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టిస్తారు. తొమ్మిది రోజులపాటు, తొమ్మిది రూపాలతో అమ్మవారిని పూజిస్తారు. తదనంతరం 28వ తేదీన అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 29వ తేదీన రంగం భవిష్యవాణి, ఘటాల నిమర్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి.