Sabarimala Pilgrimage: శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర నవంబర్ 16న ప్రారంభం కానుంది. ఆరోజు సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తొలిరోజే 20 వేల మందికి పైగా భక్తులు వస్తారని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ తెలిపారు. ఇప్పటికే సుమారు 25 వేల మంది భక్తులు ఆన్లైన్లో దర్శనం కోసం బుకింగ్ చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా దర్శనం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యాత్రకు సంబంధించిన సమాచారం, అత్యవసర సహాయం అందించేందుకు ప్రత్యేక వెబ్సైట్, వాట్సాప్ చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఏడాది మండలం-మకరవిళక్కు యాత్రకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి నీలక్కల్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి భక్తుల రద్దీ, భద్రత, రవాణా, ఇతర సౌకర్యాలపై సమీక్షించారు. నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని బస్ స్టాండ్లు, పోలీస్ బ్యారక్‌లు, ఇతర ఏర్పాట్లను కూడా పరిశీలించారు. భక్తులతో పోలీసులు మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని హోంమంత్రి ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించాలని అధికారులు సూచించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
16 నుంచి అయ్యప్ప దర్శనం : శబరిమల బయలుదేరిన 20 వేల మంది భక్తులు