నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక యాత్రకు భక్తులు లక్షల్లో తరలివస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు, పౌర్ణమి రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేసి అప్పన్న స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహాచల క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన ఉన్న మొదటి పావంచ నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం సింహాద్రినాథునికి చివరి విడత చందనాన్ని సమర్పిస్తారు. 32 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొననున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ సందర్భంగా నేడు, రేపు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు.

జూలై 20న ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించి రాత్రికి తిరిగి సింహాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 2,600 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు నేడు, రేపు గిరిప్రదక్షిణ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. భక్తులు, ప్రజలు ఆగాలని అధికారులు సూచించారు. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించామన్నారు. అయితే సింహాచలం గిరి ప్రదక్షిణను మొదటి పావంచ నుంచే ప్రారంభించాల్సి ఉంది. తొలిపావంచ నుంచి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక పోలీసు క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్‌బీ కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీ నగర్, బుచ్చిరాజు పాలెం, లక్ష్మీ నగర్, ఇందిరా నగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్, లి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *