తొలి ఏకాదశి హిందువులకు ప్రత్యకమైన రోజు ఆరోజు కచ్చితంగా ఉపవాసం ఉండేవారి సంఖ్య ఎక్కువే. మొదటిసారి ఉపవాసం అనేది మొదలైంది తొలిఏకాదశి నుంచి అని చెబుతారు. ఏదైనా మంచిపని మొదలుపెట్టాలంటే ఏకాదశిని మించిన మంచి తిధి లేదు. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఆషాడ శుక్ల ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అంటారు. లోకంలో ఉపవాసం అనేది తొలి ఏకాదశితోనే మొదలైనందని చెబుతారు.

తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం ఉండాలి. మరుసటి నాడు అంటే ద్వాదశి నాడు విష్ణమూర్తిని పూజించి ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రసాదాన్ని స్వీకరించాక భోజనం చేయాలి. ఇలా చేస్తే మోక్షాన్ని పొందవచ్చని ఎంతో మంది భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి నాడు కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పేల పిండి ఒకటి. పేలాలలో బెల్లం, యాలకులను వేసి బాగా దంచి దాన్ని తింటే ఎంతో మంచిది. ఈ పేల పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పేల పిండి శరీరానికి కాలానుగుణమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. గ్రీష్మ రుతువు నుంచి వర్ష రుతువులోకి మారుతున్నకాలం ఇది. ఎలాంటి సీజన్ వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి పేల పిండికి ఉంది. తొలి ఏకాదశినాడు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ కోశం పరిశుద్ధంగా మారుతుంది. దేహానికి నూతనోత్తేజం దక్కుతుంది.

ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి జూలై 16న రాత్రి 8:33 నిమిషాలకు మొదలవుతుంది. జూలై 17వ తేదీ రాత్రి 9:02 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి తొలి ఏకాదశిని జూలై 17న చేసుకుంటారు. ఆ రోజు విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో, సంపదలతో నిండి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *