Nov 25-Gold Cost: బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. గత రెండు రోజులుగా కొద్దిగా పెరిగిన బంగారం ధరలు నవంబర్ 25న ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో కార్తీకమాసంలో శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,580, 22 క్యారెట్ల ధర రూ.1,14,200, 18 క్యారెట్ల ధర రూ.93,440గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,65,000గా కొనసాగుతోంది.
నవంబర్ 25న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,220 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు, వెండి ధర కిలోకు రూ.10,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,65,000 వద్ద ఉంది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.165గా ఉంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
10 గ్రాములకు రూ.3వేల 220 తగ్గిన గోల్డ్.. కేజీకి రూ.10వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!


