Stock Market Crash

Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తగ్గిపోయింది. యుద్ధం మరింత ముదిరడంతో అంతర్జాతీయంగా భయాందోళనలు పెరిగాయి. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించడంతో అమెరికా, ఆసియా మార్కెట్లు పడిపోయాయి. దాని ప్రభావం భారత మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

సోమవారం మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 1000 పాయింట్లు తగ్గి 72,582 వద్ద, నిఫ్టీ 288 పాయింట్లు పడిపోయి 22,530 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.93.59 వద్ద ఉంది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి స్టాక్స్ నష్టపోగా, హిండాల్కో, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. ఆయిల్, గ్యాస్, మెటల్ రంగాలు తప్ప మిగతా రంగాలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం…

దేశీయ మార్కెట్‌కు సరికొత్త జోష్…

External Links:

యుద్ధ భయం.. భారీ నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *