Stock Market Crash

Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 986 పాయింట్లు పడిపోయి 76,576 వద్ద, నిఫ్టీ 240 పాయింట్లు తగ్గి 23,753 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం ట్రంప్ ఇరాన్‌తో 2 వారాల కాల్పుల విరమణ ప్రకటించడంతో మార్కెట్ లాభాల్లోకి వెళ్లింది.

కానీ తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు చేయడంతో పరిస్థితి మారింది. ఈ దాడుల్లో 254 మంది మరణించగా, హిజ్బుల్లా నేతకు సంబంధించిన వ్యక్తిని కూడా హతమయ్యారని సమాచారం. దీంతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. ట్రంప్ కూడా ఇరాన్‌పై హెచ్చరికలు చేయడంతో మార్కెట్లు పడిపోయాయి. నిఫ్టీలో L&T, ఇంటర్‌గ్లోబ్, HDFC బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టపోయాయి. హిండాల్కో, NTPC, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్స్, మాక్స్ హెల్త్‌కేర్ షేర్లు మాత్రం లాభపడ్డాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం…

దేశీయ మార్కెట్‌కు సరికొత్త జోష్…

External Links:

భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *