Stock Market Recovered: బడ్జెట్ రోజు భారీ నష్టాలు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం క్రమంగా కోలుకుంటోంది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్, నష్టాలే కొనసాగుతాయనే అంచనాల మధ్య కొద్దిసేపటికే లాభాల్లోకి మళ్లింది. ప్రస్తుతం సెన్సెక్స్ 312 పాయింట్లు లాభపడి 81,035 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 24,886 వద్ద ట్రేడవుతున్నాయి.
నిఫ్టీలో ఎల్ అండ్ టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆసియన్ పెయింట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ లాభాలు నమోదు చేయగా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, మాక్స్ హెల్త్‌కేర్ నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మీడియా, పీఎస్‌యు బ్యాంక్ వంటి రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి. బడ్జెట్‌లో పన్ను శ్లాబ్‌లలో మార్పులు లేకపోవడం, ఇన్వెస్టర్లకు ఆశించిన ఊరట లేకపోవడంతో నిన్న మార్కెట్ భారీగా పతనమై దాదాపు రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
హమ్మయ్య మార్కెట్ తెప్పరిల్లింది.. లాభాల్లో సూచీలు