Today Gold Value: ఇటీవల వరుసగా పెరిగిన బంగారం, వెండి ధరలు బుధవారం తగ్గాయి. వరుస రికార్డులతో కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన ధరలకు తాజాగా బ్రేక్ పడింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేయెన్ భారత్‌తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యం పెంచుతామని ప్రకటించడం, అలాగే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో పూర్తవుతుందని ట్రంప్ వెల్లడించడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ సానుకూల ప్రకటనల ప్రభావంతో బంగారం తులానికి రూ.2,290 తగ్గగా, కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది.
ధరల తగ్గుదలతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,310కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,450కు, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,15,730కు ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే, కిలో ధర రూ.3,25,000కు తగ్గింది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,40,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో రూ.3,25,000 వద్ద అమ్ముడవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
శాంతించిన బంగారం, వెండి ధరలు.. కలిసొచ్చిన ఈయూ ప్రకటన