gold silver

Gold and silver rates increasing day by day: ఇటీవల వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే రూ.3 లక్షల మార్కు దాటి కొత్త రికార్డు సృష్టించిన వెండి, త్వరలోనే రూ.4 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు కూడా అదే బాటలో పెరుగుతున్నాయి. ఈరోజు తులం బంగారంపై రూ.1,040 పెరగగా, కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో ధరలు చూసి సామాన్యులు భయపడుతున్నారు.

ఈ పెరుగుదలతో హైదరాబాద్‌, చెన్నైలో కిలో వెండి ధర రూ.3,30,000 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.3,15,000 దగ్గర అమ్ముడవుతోంది. బంగారం విషయానికి వస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,35,000కి, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,10,460కి ట్రేడ్ అవుతోంది. ధరలు ఇలా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *