Today Price of Gold: బంగారం ధరలు ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి. తులం గోల్డ్ ధర లక్షా 10 వేలు దాటింది. ఒక్క రోజులోనే రూ.1360 పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగి కిలోకు రూ.3000 పెరిగాయి. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,029గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10,110గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,100కు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,290 వద్ద ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,440గా ఉంది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర కిలోకు రూ.1,40,000గా, ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ.1,30,000గా ట్రేడ్ అవుతోంది.
Internal Links:
మళ్లీ పెరిగిన గోల్డ్-సిల్వర్ ..
External Links:
ఆల్ టైమ్ రికార్డ్.. రూ. లక్షా 10 వేలు దాటిన తులం గోల్డ్ ధర.. నేడు రూ. 1360 పెరిగింది..