కొత్తగూడెం: జిల్లాలోని జూలూరుపాడు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వాహన తనిఖీల్లో టిఎస్‌ఆర్‌టిసి రాజధాని బస్సులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ వెళ్తున్న భద్రాచలం డిపోకు చెందిన బస్సులో గంజాయి ఉన్న రెండు బ్యాగులను పోలీసులు గుర్తించారు.ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.