Latest Breaking News Telugu

News5am, Latest Breaking News Telugu (22-05-2025): సైబర్ మోసగాళ్ల చేతికి వెళ్లిన రూ. 5.80 లక్షలను తిరిగి రికవర్ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు ఘనవిజయం సాధించారు. కామారెడ్డి కి చెందిన రాజేందర్ అనే వ్యక్తికి ఇటీవల ఓక తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తులు తాము ముంబై పోలీసులు అంటూ పరిచయం చేసుకొని, రాజేందర్ పేరు మీద మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టారు. అతని బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని తాము చెప్పిన ఖాతాకు వెంటనే పంపించాలని, లేకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించారు.

దీనివల్ల భయపడిన రాజేందర్, నిందితులు చెప్పిన ఖాతాలోకి రూ. 5.80 లక్షలను బదిలీ చేశాడు. కొద్ది సేపటికి తనకి మోసం జరిగిందని గ్రహించిన రాజేందర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా స్పందించిన పోలీసులు సైబర్ నేరగాళ్ల ఖాతాను ఫ్రీజ్ చేసి, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొత్తాన్ని తిరిగి రికవర్ చేశారు. కామారెడ్డి పోలీసుల ఈ వేగవంతమైన చర్యపై ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకూడదని, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ముందుగా ధృవీకరించకుండా చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

More News:

Latest Breaking News Telugu:

తెలంగాణ రాజ్ భవన్‎లో చోరీ..

రూ. 6200 కోట్లకు పైగా బ్యాంక్ స్కామ్..

More Latest Breaking News: External Sources

కామారెడ్డిలో సైబర్ మోసం.. 5.8 లక్షలు రికవరీ చేసిన పోలీసులు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *